'సోగ్గాడే చిన్నినాయనా' డైరెక్టర్ తో రవితేజ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సోగ్గాడే చిన్నినాయనా' డైరెక్టర్ తో రవితేజ!

  • రెండు హిట్స్ ఇచ్చిన కల్యాణ్ కృష్ణ 
  • వెంకీ, చైతూలతో మరో ప్రాజెక్టు 
  • సర్దుబాటు కాని ఇద్దరి డేట్స్ 
  • వేరే ప్రాజెక్టుపై దృష్టిపెట్టిన కల్యాణ్ కృష్ణ
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా, నాగార్జున కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. నాగ్ కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఆ తరువాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా కూడా విజయాన్ని సాధించింది. అలాంటి కల్యాణ్ కృష్ణ .. రవితేజ కోసం ఒక లైన్ రెడీ చేసి ఆయనకి వినిపించాడట.

లైన్ బావుందనీ .. పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని రవితేజ అన్నట్టు తెలుస్తోంది. అయితే అంతకుముందే వెంకటేశ్ .. నాగచైతన్య కాంబినేషన్లో చేయాలనుకున్న కల్యాణ్ కృష్ణ, వాళ్లకి ఓ కథ వినిపించి వున్నాడు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ఇద్దరూ డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నారట. ఈ ప్రాజెక్టు మరీ లేట్ అవుతుందనుకుంటే, రవితేజతో సెట్స్ పైకి వెళ్లిపోవాలనే ఆలోచనలో కల్యాణ్ కృష్ణ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. 
kalyan krishna

More Telugu News