సాయంత్రం 4 గంటలకు ఆ ఛానల్ లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి మొత్తం చెబుతా: రామ్ గోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయంత్రం 4 గంటలకు ఆ ఛానల్ లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి మొత్తం చెబుతా: రామ్ గోపాల్ వర్మ

  • సాక్షి టీవీలో ఇంటర్వ్యూ
  • ఎన్టీఆర్ పాత్ర పోషించే నటుడి గురించి బెబుతా
  • సినిమాకు సంబంధించి నా ప్లాన్లను వెల్లడిస్తా
ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పటి నుంచి జరిగిన ఘటనల ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను తెరకెక్కించబోతున్నానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటి నుంచి దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో అనే చర్చ సర్వత్ర కొనసాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేతలు, వర్మల మధ్య కొనసాగిన మాటల యుద్ధం కూడా ఉత్కంఠను మరింత పెంచింది. మరోవైపు, ఈ సినిమా నిర్మాత వైసీపీ నేత అని వెల్లడి కావడంతో... చర్చ మొత్తం రాజకీయపరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం నాలుగు గంటలకు సాక్షి ఛానల్ లో తన ఇంటర్వ్యూ ఉంటుందని వర్మ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి ఈ ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పాత్రను పోషించబోయే నటుడి గురించి, సినిమాకు సంబంధించి తన ప్లాన్ల గురించి ఈ ఇంటర్వ్యూలో చెబుతానని తెలిపారు. 
lakshmi's ntr
ramgopal varma

More Telugu News