చిరూ ఫ్యామిలీని నేను సెలెక్టివ్ గా కార్నర్ చేయలేదు!: రామ్ గోపాల్ వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూ ఫ్యామిలీని నేను సెలెక్టివ్ గా కార్నర్ చేయలేదు!: రామ్ గోపాల్ వర్మ

  • చిరూ ఫ్యామిలీపై చేసిన విమర్శల గురించి వర్మ 
  • సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై అభిప్రాయం చెబుతా 
  • చిరూ ఫ్యామిలీని నేనెప్పుడూ సెలక్టివ్ గా తీసుకోలేదు    
రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో వివాదాలనే తన సినిమాలకి కథా వస్తువుగా మలచుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు, ఆయా విషయాలపై కూడా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కొత్త వివాదాలకు కారణమవుతున్నారు. ఈ విషయంలో అవతలవారు ఎదురుదాడికి దిగినా ఆయన పెద్దగా పట్టించుకోరు.

 ఇక ఆ మధ్య ఆయన మెగా ఫ్యామిలీపై వరుస విమర్శలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేకించి ఆ ఫ్యామిలీపై అంత గ్రడ్జ్ .. లవ్ ఎందుకు? అనే ప్రశ్న తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో వర్మకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. చిరూ ఫ్యామిలీ ఒన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పారు. ఆ ఫ్యామిలీపై తనకి గ్రడ్జ్ .. లవ్ ఉందనేది కరెక్ట్ కాదని అన్నారు. మోదీ కావొచ్చు .. ట్రంప్ కావొచ్చు .. మరెవరైనా సెలబ్రిటీ కావొచ్చు .. వాళ్లకి సంబంధించిన విషయాలపై తన అభిప్రాయాన్ని సూటిగా చెబుతానని అన్నారు. అంతేగాని సెలక్టివ్ గా తాను చిరూ ఫ్యామిలీని కార్నర్ చేయలేదనే విషయాన్ని స్పష్టం చేశారు.    
ram gopal varma

More Telugu News