రవితేజతో రంగంలోకి దిగుతోన్న బండ్ల గణేశ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజతో రంగంలోకి దిగుతోన్న బండ్ల గణేశ్?

  • స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన బండ్ల గణేశ్
  • భారీ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన తీరు
  • సక్సెస్ లతో పాటు పరాజయాలు
  • కొంత గ్యాప్ తరువాత రీ ఎంట్రీ    
కొంతకాలం క్రితం వరకూ నిర్మాత బండ్ల గణేశ్ భారీ సినిమాలను నిర్మిస్తూ వచ్చాడు. స్టార్ హీరోలతో ఆయన నిర్మించిన సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ను సాధించగా .. మరికొన్ని పరాజయం పాలయ్యాయి. అయినా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన, నిర్మాతగా అప్పటివరకు తాను పోషించిన పాత్రను 'టెంపర్' తరువాత హఠాత్తుగా పక్కన పెట్టేశాడు.

భారీ సినిమాల నిర్మాత ఒక్కసారిగా సైలెంటైపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక త్వరలోనే మళ్లీ ఆయన సినిమా నిర్మాణాన్ని మొదలెట్టనున్నాడనేది తాజా సమాచారం. రవితేజ కథానాయకుడిగా ఒక సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడని అంటున్నారు. గతంలో తన బ్యానర్లో చేసిన ఓ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును గురించి బండ్ల గణేశ్ త్వరలోనే ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. 
bandla ganesh
raviteja

More Telugu News