ధోనీతో డిన్నర్ డేట్ కి వెళ్లాలని ఉందంటున్న 'ధోనీ' సినిమా భామ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీతో డిన్నర్ డేట్ కి వెళ్లాలని ఉందంటున్న 'ధోనీ' సినిమా భామ!

  • డిన్నర్ డేట్ అంటే ఏంటో తెలీదు
  • ధోనీని హర్భజన్ రిసెప్షన్ లో చూశా
  • కుటుంబం పట్ల చాలా కేరింగ్ గా ఉంటాడు
  • ధోనీ బయోపిక్ లో అతని భార్య పాత్రలో నటించిన కైరా అద్వానీ
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీతో డిన్నర్‌ డేట్‌ కు వెళ్లాలని ఉందని బాలీవుడ్‌ నటి కైరా అద్వానీ తెలిపింది. గతేడాది విడుదలైన బయోపిక్ ‘ధోనీ: ద అన్‌ టోల్డ్‌ స్టోరీ’ సినిమాలో ధోనీ భార్య సాక్షి పాత్రలో కనిపించిన కైరా అద్వానీ ఒక క్రీడా ఛానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ సందర్భంగా మీ అభిమాన క్రీడాకారుడు ఎవరు? అవకాశం వస్తే ఏ ఆటగాడితో క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ డేట్‌ కు వెళ్తారు? అంటూ యాంకర్ ప్రశ్నించగా, ఏమాత్రం తడుముకోకుండా 'ధోనీతో..' అంటూ సమాధానం చెప్పింది.

‘హర్భజన్‌ సింగ్‌ రిసెప్షన్‌ లో తొలిసారిగా ధోనీని చూశాను. తన కుటుంబ సభ్యుల పట్ల చాలా కేరింగ్ గా ఉంటాడు. అంతేకాదు జీవాను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎత్తుకుంటాడు. అందుకే ధోనీతో క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ డేట్‌ ఒకే... అయితే నాకు కేండిల్ లైట్ డిన్నర్ డేట్ అంటే ఏంటో తెలీదు... కానీ మహీతో డిన్నర్ చేయాలని ఉంది. చూడ్డానికి చాలా నార్మల్ గా ఉంటాడు. అందుకే అతనంటే చాలా ఇష్టం. అతని తరువాత కోహ్లీ అంటే ఇష్టం, హాట్ గా కనిపిస్తాడు' అని గలగలా చెప్పేసి, నవ్వేసింది. 
dhoni
kaira advani
dinner date

More Telugu News