ఇతర దేశాల్లోను రిలీజైన 'రాజుగారి గది 2' .. భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇతర దేశాల్లోను రిలీజైన 'రాజుగారి గది 2' .. భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్!

  • నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాజుగారి గది 2'
  • భారీ స్థాయిలో దక్కిన ఓపెనింగ్స్ 
  • అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ 
  • నాగ్ .. సమంతల నటనకు ఫిదా
నాగార్జున .. సమంతా ప్రధానమైన పాత్రలను పోషించిన 'రాజుగారి గది 2' సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు ఇతర దేశాల్లోను భారీ స్థాయిలో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.

 'రాజుగారి గది 2' కూడా అదే మార్గాన్ని అనుసరించింది. కెన్యా .. ఉగాండా .. టాంజానియా .. ఆఫ్రికన్ దేశాలతో పాటు, స్వీడన్ .. డెన్మార్క్ .. కజికిస్థాన్ .. కిర్గిస్థాన్ లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. 7 అరబ్ కంట్రీస్ లోను ఈ సినిమాను విడుదల చేశారు. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా వసూళ్లు భారీగా ఉండొచ్చుననే టాక్ వినిపిస్తోంది. ఇక శాటిలైట్ .. హిందీ డబ్బింగ్ .. డిజిటల్ రైట్స్ కు గాను 10 కోట్లు వచ్చేసినట్టు సమాచారం.  
nagarjuna
samanta

More Telugu News