ఈ ప్రమాదాన్ని చూస్తే.. 'ఎలా జరిగిందా?' అని ఆశ్చర్యపోవడం ఖాయం... వీడియో చూడండి!
- చైనాలోని స్వీహ్వా నగరంలోని జాతీయ రహదారిపై ప్రమాదం
- రోడ్డును వదిలి దూసుకెళ్లిన కారు
- కిందపడుతుండగా చెట్లమధ్య ఇరుక్కున్న కారు
అలా వేగంగా రోడ్డును వీడి దూసుకెళ్లిన కారు... చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కుపోయింది. రాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో చెట్ల మధ్య కారు ఇరుక్కుపోవడంతో ఎవరూ గాయపడలేదు. మరుసటి రోజు అటుగా వెళ్తున్న ప్రయాణికులు గాల్లో వేలాడుతున్న కారును చూసి ఆశ్చర్యపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వచ్చి క్రేన్ సాయంతో కారును కిందికిదించారు. దీనిని వీడియో తీసిన పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ గా మారింది. ఇలాంటి ప్రమాదం ఎక్కడైనా చూశారా? అంటూ నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు.