రాజ‌కీయాల్లోకి సినీన‌టుడు కమల్ హాసన్ ఎంట్రీ ఇస్తుండ‌డంపై ఆయ‌న కూతురు శ్రుతి హాసన్‌ స్పందించింది. రాజకీయాల్లో తన మద్దతు త‌న తండ్రికి ఉంటుందని ఆమె తెలిపింది. ఈ రోజు చెన్నైలో ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న శ్రుతిహాస‌న్ మాట్లాడుతూ... రాజకీయాల్లో క‌మ‌ల్ త‌ప్ప‌కుండా రాణిస్తార‌ని చెప్పింది. ఆయన నిజాయతీపరుడు కాబ‌ట్టి అన్ని విష‌యాల్లో మొహ‌మాటం లేకుండా మాట్లాడేస్తార‌ని తెలిపింది. కాగా, క‌మ‌లహాస‌న్ కొత్త పార్టీని పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. వ‌చ్చేనెల 7న త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త పార్టీ పేరు ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.