కాజల్ కాదంటే రంగంలోకి రకుల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాజల్ కాదంటే రంగంలోకి రకుల్!

  • తమిళంలో హిట్ కొట్టిన 'బోగన్'
  • తెలుగు రీమేక్ లో రవితేజ
  • కథానాయిక ఖరారు కావలసి వుంది
రవితేజ తాజా చిత్రంగా ఈ నెల 19వ తేదీన 'రాజా ది గ్రేట్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' చేయనున్నాడు. ఇక ఈ మూవీతో పాటుగా ఆయన తమిళ రీమేక్ లో చేయడానికి సైన్ చేశాడు .. ఆ సినిమా పేరే 'బోగన్'. జయం రవి .. అరవింద్ స్వామి కాంబినేషన్లో ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'బోగన్' అక్కడ ఘన విజయాన్ని అందుకుంది.

దాంతో తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా కేథరిన్ ను తీసుకున్నారు. అయితే ఆమెను తప్పించి కాజల్ ను ఎంపిక చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇంకా సంప్రదింపులు జరుగుతూనే వున్నాయట. అందువలన ఆమె ఎంపిక ఖరారు కాలేదని అంటున్నారు. ఒకవేళ ఆమె కాదన్నా .. డేట్స్ ఖాళీ లేవన్నా రకుల్ ను తీసుకోవాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా సమాచారం. ఇక రవితేజ .. రకుల్ కాంబినేషన్లో గతంలో 'కిక్ 2' వచ్చిన సంగతి తెలిసిందే.     
raviteja
rakul

More Telugu News