మినహాయింపునకు జగన్ అనర్హుడు: కోర్టుకు తెలిపిన సీబీఐ
- తీవ్రమైన ఆర్థిక నేరమిది
- మినహాయింపు ఇచ్చేందుకు వీల్లేదు
- ప్రత్యేక కోర్టులో సీబీఐ
- కాసేపట్లో నిర్ణయం
దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టగా, మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది. కాగా, తనకు ఆరు నెలల పాటు మినహాయింపు కావాలని జగన్ కోరగా, సీబీఐ అభ్యంతరం చెబుతూ, కోర్టు అనుమతించరాదని కోరింది. ఈ కేసులో న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంది. అంతకుముందు ఇదే విషయమై జగన్, హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ కోర్టులోనే పిటిషన్ వేసి అనుమతి తీసుకోవచ్చని సూచించిన సంగతి తెలిసిందే.