టీడీపీ ఎమ్మెల్యే అనితకి వ్యంగ్యంగా సమాధానాలు ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ!

12-10-2017 Thu 20:37 | Entertainment
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనిత
  • ఎమ్మెల్యే అనిత అన్న ప్రతి వ్యాఖ్యకు వర్మ క్లుప్తంగా సమాధానం
  • చివరికి ‘ఆహా క్లాప్సు విజిల్స్’ అని పేర్కొన్న వివాదాస్పద దర్శకుడు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై టీడీపీ ఎమ్మెల్యే అనిత మండిపడ్డ విషయం తెలిసిందే. రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకనే ఈ సినిమా తీస్తున్నారని, జగన్ జీవిత చరిత్రను సినిమా రూపంలో చూపిస్తే ఆయన పాదయాత్ర కూడా చేయలేరని అన్నారు. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గట్టిగా సమాధానం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎమ్మెల్యే అనితకి కూడా జవాబు ఇచ్చారు. ఆయన ఫేస్ బుక్ లో రాసుకొచ్చిన వ్యాఖ్యలు యథాతథంగా...

టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి నా సమాధానాలు:
టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ పైన వర్మ తీస్తున్న సినిమాలో చరిత్రను వక్రీకరించవద్దు
వర్మ జవాబు: అనిత గారు, బయట తెలిసిన చరిత్ర వెనుక లోపలి అసలు చరిత్ర చూపించడమే నా అసలు సిసలు ఉద్దేశం

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ మహానుభావుడు...ఆయన పేదలకు ,ప్రజలకు చేసిన మంచిని వర్మ తన సినిమాలో చూపించాలి.
జవాబు: అనితగారు, ఈ సినిమా బయోపిక్ కాదు.. కేవలం లక్ష్మి పార్వతి గారు ఆయన జీవితంలో ప్రవేశించినప్పటినుంచీ తుది వరకూ

టీడీపీ ఎమ్మెల్యే అనిత: ఎన్టీఆర్ కీర్తికి భంగం కలిగేలా ఎవరు సినిమా తీసినా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు చూస్తూ ఊరుకోరు.
జవాబు: అనితగారు, ఇలాంటి వార్నింగ్ లు టీడీపీ పుట్టకముందు నుంచి విని విని విసుగెత్తిపోయాను

టీడీపీ ఎమ్మెల్యే అనిత: రాజకీయంగా చంద్రబాబును ఎదుర్కోలేకే.. వైసీపీ నేతలు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నట్లు ఉంది..
జవాబు: లోగుట్టు పెరుమాళ్ళకెరుక

టీడీపీ ఎమ్మెల్యే అనిత: చనిపోయిన ఎన్టీఆర్ పైన సినిమా తీసి టీడీపీని ఇబ్బంది పెట్టాలని వైసీపీ నేతలు అనుకుంటే...బ్రతికి ఉన్న జగన్ పైన కూడా సినిమా తీసే వాళ్ళు ఉన్నారు.. జగన్ జీవిత చరిత్ర ప్రజలకు సినిమా రూపంలో చూపిస్తే..ఆయన పాదయాత్ర కూడా చెయ్యలేరు..
జవాబు: అనితగారు, మీరు సూపరు ..నాకు తెలిసి ఇలాంటి స్క్రిప్ట్ ఐడియా షోలే రైటర్ సలీమ్ జావేద్ కి కాని, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా వచ్చిఉండదు

టీడీపీ ఎమ్మెల్యే అనిత: మహానుభావుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి... అదే సమాజహితం
జవాబు: ఆహా.. క్లాప్సు.. విజిల్స్ !!! 
వర్మ

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more