ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో డేరా బాబా గుర్మీత్ సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ ఆసక్తికర విషయాలు బయటపెడుతోంది. గతవారం అరెస్టయిన హనీప్రీత్ ను హరియాణాకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. సిర్సా పట్టణంలో డేరా బాబా ఆశ్రమంలో గుర్మీత్‌కి చెందిన ఓ గుహ ఉంది. దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆ గుహలోకి గుర్మీత్, హనీప్రీత్ కి తప్పా మరెవ్వరికీ అనుమతి లేదట.

విశేషం ఏమిటంటే, ఆ గుహ తలుపులు తన వేలిముద్రలతోనే తెరుచుకుంటాయని సిట్ విచారణలో హనీప్రీత్ బయటపెట్టింది. గుర్మీత్ అరెస్టయ్యాక పంచకులలో అల్లర్లకు పాల్పడేలా చేసింది తానేనని, ఇందుకోసం, కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశానని చెప్పింది. విచారణలో బయటపెట్టిన విషయాలను ల్యాప్ టాప్ లో భద్రపరుస్తున్నట్లు పోలీస్ అధికారులు చెప్పారు.