శ్లోకాలు తప్పుగా పఠిస్తున్నాడని ఫోక్ సింగర్ ను చంపేసిన పూజారి.. గ్రామాన్ని విడిచి పారిపోయిన 200 మంది ముస్లింలు

11-10-2017 Wed 16:53 | National
  • రాజ‌స్థాన్‌లోని దంత‌ల్ లో హ‌త్య
  • శ్లోకాలు తప్పుగా చదువుతున్నాడని తన సోదరులతో కలిసి చంపేసిన పూజారి
  • పూజారి అరెస్ట్.. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు
  • గ్రామంలో ఘర్షణపూరిత వాతావరణం
రాజ‌స్థాన్‌లోని ఓ గ్రామం నుంచి 200 మంది ముస్లింలు పారిపోవ‌డం అల‌జ‌డి రేపుతోంది. ఆ రాష్ట్రంలోని దంత‌ల్ అనే గ్రామంలో గ‌త నెల 27న ఓ పూజారి, అత‌డి సోద‌రులు క‌లిసి ముస్లిం ఫోక్ సింగ‌ర్ ను హ‌త్య చేశారు. అప్ప‌టి నుంచి ఆ గ్రామంలో ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో 20 కుటుంబాల‌కు చెందిన 200 మంది ఊరు విడిచి అదే రాష్ట్రంలోని జైస‌ల్మెర్‌కి వెళ్లిపోయారు. అక్క‌డ త‌మ‌కు ఉండడానికి గూడు లేక నానా క‌ష్టాలు ప‌డుతున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తోన్న పోలీసులు మాట్లాడుతూ... స‌ద‌రు ఫోక్ సింగర్ అహ్మ‌ద్ ఖాన్‌ శ్లోకాలు పఠిస్తూ గానం చేస్తూ ఉండేవాడ‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో శ్లోకాల్లో త‌ప్పులు దొర్లుతున్నాయ‌ని, వాటిని ప‌ఠించ‌కూడ‌ద‌ని స్థానిక పూజారి ర‌మేష్ సుతార్‌ గొడ‌వ‌పెట్టుకుని, త‌న ఇద్ద‌రు సోద‌రుల‌తో క‌లిసి అహ్మ‌ద్ ఖాన్‌ను చంపేశాడని చెప్పారు. అప్పటి నుంచి హిందువులు, ముస్లింలు గొడ‌వ‌లు ప‌డుతున్నార‌ని, అందుకే ముస్లింలు ఊరు విడిచి వెళ్లార‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి క‌లెక్ట‌ర్ కేసీ మీనా మాట్లాడుతూ.. ఇరు క‌మ్యూనిటీల‌తో తాము చర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని చెప్పారు. ఊరు విడిచి వెళ్లిన ముస్లింలు మళ్లీ తమ గ్రామానికి రావడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో పూజారిని అరెస్టు చేసిన పోలీసులు మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
ముస్లింహత్య

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more