'రాజా ది గ్రేట్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రాజా ది గ్రేట్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ఖరారు

  • రవితేజ తాజా చిత్రంగా 'రాజా ది గ్రేట్'
  • తొలిసారిగా అంధుడి పాత్ర
  • కథానాయికగా మెహ్రీన్
  • ఈ నెల 18న భారీ రిలీజ్        
రవితేజ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్' సినిమా తెరకెక్కింది. చూపులేని వ్యక్తిగా రవితేజ కనిపించే ఈ సినిమాలో, కథానాయికగా మెహ్రీన్ కనిపించనుంది. ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీగా వుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జరపడానికి దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు.

ఈ నెల 14వ తేదీన ఈ ఫంక్షన్ ను గ్రాండ్ గా జరపనున్నట్టు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పటాస్ .. సుప్రీమ్ వంటి హిట్స్ తరువాత అనిల్ రావిపూడి చేసిన సినిమా ఇది. ఇక 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' .. 'మహానుభావుడు' సక్సెస్ ల తరువాత మెహ్రీన్ చేసిన మూవీ ఇది. ఈ ఇద్దరికీ ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ ఇస్తుందేమో చూడాలి. 'బెంగాల్ టైగర్' తరువాత ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోన్న రవితేజ మాత్రం, ఈ సినిమా హిట్ పై పూర్తి నమ్మకంతో వున్నాడు.      
raviteja
mehreen

More Telugu News