తెలంగాణ ఆదాయం 53 శాతం, ఏపీ ఆదాయం 47 శాతం.. అయినా అక్కడి కన్నా ఎక్కువ రుణమాఫీ: చంద్రబాబు

09-10-2017 Mon 16:55 | Both States
  • మూడో విడ‌త రైతు రుణ‌మాఫీ కార్య‌క్ర‌మం ప్రారంభం
  • రాష్ట్ర ఆదాయం తక్కువ, అయినప్పటికీ ఒక్కో రైతుకి లక్షన్నర రుణమాఫీ
  • తెలంగాణలో లక్ష రూపాయలు మాత్రమే
  • మూడో విడత కింద 36.72 లక్షల మంది రైతులకు మొత్తం రూ.3,600 కోట్లు
రైతుల క‌ష్టాలు తీర్చే అవ‌కాశం త‌న‌కు వ‌చ్చిందని, అది త‌న‌ అదృష్టంగా భావిస్తున్నానని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. క‌ర్నూలు జిల్లా తంగ‌డంచలో చంద్ర‌బాబు నాయుడు మూడో విడ‌త రైతు రుణ‌మాఫీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ఎన్నిక‌ల‌కు ముందు 208 రోజులు పాద‌యాత్ర చేశానని అన్నారు. అప్ప‌ట్లో త‌న‌ కాలు కూడా దెబ్బ‌తిందని, డాక్ట‌ర్లు న‌డ‌వ‌కూడ‌ద‌ని చెప్పారని తెలిపారు. కానీ తానో సంక‌ల్పం చేశానని, ప్ర‌జ‌ల స్థితిగ‌తుల‌ను నేరుగా చూడాలనుకున్నాన‌ని తెలిపారు.

రైతుల క‌ష్టాల‌ను గురించి తెలుసుకున్నాన‌ని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం విడిపోయిన త‌రువాత తెలంగాణ ఆదాయం 53 శాతంగా ఉండేదని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఆదాయం 47 శాతం ఉండేద‌ని చెప్పారు. ఏపీ జ‌నాభా 58 శాతం, తెలంగాణ‌ జ‌నాభా 42 శాతం అని చెప్పారు. తెలంగాణ‌లో ల‌క్ష రూపాయ‌లు మాత్ర‌మే రుణ‌మాఫీ చేస్తామ‌ని హామీ ఇస్తే, తాము మాత్రం ల‌క్షా యాభై వేల రూపాయ‌లు చేస్తామ‌ని చెప్పామ‌ని అన్నారు.

రైతుల క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌న్న ఏకైక ధ్యేయంతో ముందుకు వెళ్లానని చెప్పారు. ఇంకా రెండే ఇన్‌స్టాల్ మెంట్లు ఇవ్వాలని చెప్పారు. రైతులు దిగులు ప‌డ‌డానికి వీల్లేదని చెప్పారు. తాను కూడా రైతు కుటుంబం నుంచి వ‌చ్చానని చెప్పారు. మూడో విడత కింద 36.72 లక్షల మంది రైతులకు మొత్తం రూ.3,600 కోట్లు ఇస్తున్నామని చెప్పారు.
చంద్రబాబు

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more