యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఎనిమిది మంది భారతీయులు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. గల్ఫ్ దేశాల్లో లాటరీలను అధికారికంగా నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ లాటరీలు అదృష్టవంతులను వరించి, రాత్రికి రాత్రి వారి జాతకాలను మార్చేస్తాయి.

ఈ నేపథ్యంలో తాజాగా యూఏఈలో నిర్వహించిన బిగ్ టికెట్ డ్రా నెలవారీ లాటరీలో పదిమంది విజేతలను ప్రకటించారు. ఇందులో ఎనిమిది మంది భారతీయులు కాగా, మిగిలిన ఇద్దరూ ఫిలిప్పీన్స్, కెనడా దేశాలకు చెందినవారు కావడం విశేషం. లాటరీ మొత్తం 17.6 కోట్ల రూపాయలను వీరందరికీ ఒక్కొక్కరికి 1.76 కోట్ల రూపాయల చొప్పున పంచుతారు. లాటరీలో విజయం సాధించడం ఆనందంగా ఉందని విజేతలు తెలిపారు.