టీటీడీపీ నేతల వ్యవహారశైలిపై చంద్రబాబు సీరియస్!

08-10-2017 Sun 14:00 | Both States
  • టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం
  • పొత్తుల విషయమై ఇష్టానుసారం మాట్లాడొద్దని హెచ్చరిక
  • గ్రూపు రాజకీయాలను పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బాబు ఆదేశాలు
టీటీడీపీ నేతల వ్యవహారశైలిపై పార్టీ అధినేత చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. తెలంగాణ టీడీపీ నేతలతో  ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడం, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయమై ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడవద్దని పార్టీ నేతలు, నాయకులను హెచ్చరించినట్టు సమాచారం. తనపై ఆధారపడకుండా సొంతంగా తెలంగాణలో బలపడాలని, గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.

 కాగా, తొలిసారిగా టీటీడీపీ సమావేశానికి దేవేందర్ గౌడ్, ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు. చంద్రబాబుకు రెండు వినతిపత్రాలను ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అందజేశారు. ఏపీలో 4,500 మంది బీసీ ఐఏఎస్ అభ్యర్థుల కోసం స్టడీ సర్కిల్, చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయా వినతిపత్రాల్లో కోరినట్టు సమాచారం. ఈ సమావేశంలో టీడీపీ నేతలు ఎల్. రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మోత్కుపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీపీచంద్రబాబు

More Telugu News

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14
..more