వెబ్‌సిరీస్‌లో న‌టించ‌నున్న క‌మ‌లహాస‌న్ రెండో కూతురు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెబ్‌సిరీస్‌లో న‌టించ‌నున్న క‌మ‌లహాస‌న్ రెండో కూతురు?

  • రానాతో క‌లిసి న‌టించే అవ‌కాశం
  • స్టోరీలు వింటున్న అక్ష‌ర హాస‌న్‌
  • రాబోయే కాలం వెబ్ సిరీస్‌ల‌దే
ఇటీవ‌ల `వివేకం` సినిమాలో హ్యాక‌ర్ పాత్ర‌లో క‌నిపించిన క‌మ‌ల్ కూతురు అక్ష‌ర హాస‌న్, త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న `సోష‌ల్‌` వెబ్‌సిరీస్ లో ఓ పాత్ర కోసం `వియూ` మీడియా వారు ఆమెను సంప్ర‌దించినట్లు స‌మాచారం. అయితే దాని గురించి ఇంకా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయ‌ని, ఇంకా ఆ సిరీస్‌లో న‌టించ‌డంపై ఎలాంటి స్ప‌ష్ట‌త‌కు రాలేద‌ని అక్ష‌ర చెప్పింది.

అలాగే ఇత‌ర వెబ్ సిరీస్‌ల‌కు సంబంధించి కూడా స్టోరీలు వింటున్న‌ట్లు అక్ష‌ర తెలిపింది. ఈ మ‌ధ్య ట్రెండ్‌గా మారిన వెబ్ సిరీస్‌ల గురించి ఆమె మాట్లాడుతూ భ‌విష్య‌త్తులో ఈ వెబ్ సిరీస్‌లు మంచి ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంటాయ‌ని, రాబోయే కాలం వెబ్ సిరీస్‌ల‌దేన‌ని అంది. సినిమాలు, వెబ్ సిరీస్ మంచి స‌మ‌న్వ‌యంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటే చూడాల‌ని ఉందని అక్ష‌ర అంది.
kamal hasan
web series
akshara hasan
shruthi hasan
rana
social

More Telugu News