అమ్మకానికి యూజర్ నేమ్‌లు, పాస్వర్డులు... హ్యాక్‌కి గురైన ఆర్బీఐ, డీఆర్డీఓ, ఈపీఎఫ్ఓ
- వెల్లడించిన సైబర్ సెక్యూరిటీ సంస్థ సెక్రైట్ సైబర్ ఇంటెలిజెన్స్
- దేశ ఇంటర్నెట్ రిజిస్ట్రీ నుంచి దాడి చేసిన హ్యాకర్
- కొన్ని ప్రైవేట్ సంస్థలపై కూడా దాడి
జాతీయ ఇంటర్నెట్ రిజిస్ట్రీ విభాగం జాతీయ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది. దీన్ని బట్టి చూస్తే దేశంలో చాలా ఐపీ అడ్రస్‌లు హ్యాక్‌కి గురై ఉండొచ్చని సంస్థ అభిప్రాయపడుతోంది. అయితే డేటాను కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు నటిస్తూ హ్యాకర్‌తో సంప్రదింపులు జరిపామని, అయితే అతను ఎక్కువగా విషయాలు వెల్లడించడానికి ఇష్టపడలేదని సంస్థ తెలియజేసింది. బాగా ఒత్తిడి చేయగా తన దగ్గర ఆర్బీఐ, డీఆర్డీఓ, ఈపీఎఫ్ఓ సంస్థల డేటా ఉన్న విషయాన్ని చెప్పాడని అంది. అలాగే హ్యాక్‌కి గురైన 6000 వరకు ఈ-మెయిళ్ల వివరాలను అతను పంపించాడని వివరించింది.