'ఇగో' సమస్యలతో మారుతి సినిమా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఇగో' సమస్యలతో మారుతి సినిమా!

  •  మారుతి నెక్స్ట్ మూవీ నాగచైతన్యతో
  •  'ఇగో' సమస్యలే ప్రధాన కథాంశం
  •  కథానాయికగా సమంతను ఒప్పించే ప్రయత్నం
  •  ఈ నెలాఖరులో సెట్స్ పైకి  
ఈ మధ్య మారుతి కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించేటటువంటి కథలకు ప్రాముఖ్యతనిస్తున్నాడు. రీసెంట్ గా హిట్ తెచ్చిపెట్టిన 'మహానుభావుడు' అందుకు నిలువెత్తు నిదర్శనం.

'భలే భలే మగాడివోయ్'లో మతిమరుపు కాన్సెప్ట్ ను .. 'మహానుభావుడు'లో అతి శుభ్రత కాన్సెప్ట్ ను ఎంచుకున్న మారుతి, తన తదుపరి సినిమా కోసం 'ఇగో' సమస్యలను కథగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటమధ్య తలెత్తే ఇగో సమస్యలు .. వాటి పరిణామాలను ఆయన తనదైన శైలిలో చూపనున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయకుడు నాగచైతన్య అనే సంగతి తెలిసిందే. కథానాయికగా సమంతాను ఒప్పించే ప్రయత్నంలో మారుతి వున్నాడు. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. 
maruthi

More Telugu News