ప్రియుడి బాటలోనే కొత్త బిజినెస్ ప్రారంభించిన అనుష్క శర్మ

  • సొంత ఫ్యాషన్ బిజినెస్ ప్రారంభించిన అనుష్క
  • అక్టోబర్ మొదటి వారం నుంచి మార్కెట్లోకి దుస్తులు
  • ఇప్పటికే ఈ బిజినెస్ లో ఉన్న కోహ్లీ
బాలీవుడ్ నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మ సొంత బ్రాండ్ తో దుస్తుల బిజినెస్ ప్రారంభించింది. వాస్తవానికి వీరిద్దరూ కలసి దుస్తుల బిజినెస్ ప్రారంభిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. ఆ వార్తలను అనుష్క కొట్టిపారేసింది కూడా.

కోహ్లీకి ఇప్పటికే 'రాంగ్' పేరిట సొంత ఫ్యాషన్ బిజినెస్ ఉంది. ఇప్పుడు ప్రియుడి బాటలోనే అనుష్క కూడా తన సొంత ఫ్యాషన్ బ్రాండ్ తో దుస్తుల బిజినెస్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా మీడియాతో అనుష్క మాట్లాడుతూ, దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాలని గత నాలుగేళ్లుగా అనుకుంటున్నానని... ఈ రంగంలో తనకు చాలా ఆసక్తి ఉందని తెలిపింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ దుస్తులు వినియోగదారులకు లభించనున్నాయి. 
Go Back to Shorts
virat kohli
anushka shetty
team india
bollywood
anushka business

More Telugu News