ప్రధాని మోదీని ఉగ్రవాది అన్న పాక్ విదేశాంగ శాఖ మంత్రి!
- భారత్ ఒక ఉగ్రవాది చేతిలో నడుస్తోంది
- గుజరాత్ ముస్లింల రక్తాన్ని మోదీ కళ్లజూశారు
- ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాదసంస్థ
ఈ నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందని సుష్మా స్వరాజ్ ఆరోపించింది, కానీ వారి దేశమే ఒక ఉగ్రవాది చేతిలో నడుస్తోందని ఎద్దేవా చేశారు. మోదీ గుజరాత్ లో ముస్లింల రక్తం కళ్లజూశాడని అన్నారు. భారత్ లో ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్థ అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదైన మోదీని ప్రధానిగా భారతీయులు ఎన్నుకున్నారని ఆయన ఆరోపించారు.