టీవీ ఛానెల్ చర్చలో యాంకర్ ప్రసవ వేదన... సోషల్ మీడియాలో వైరల్!
- ట్విట్టర్ పదాల పెంపుపై చర్చ నిర్వహించిన నటాలియా
- నిపుణుల చర్చలో నవ్వు... ఒత్తిడికి బయటికి వచ్చిన ఉమ్మనీరు
- ప్రసవ వేదన అనుభవిస్తూనే సమయస్ఫూర్తితో వ్యవహరించిన యాంకర్
అప్పుడే సమయస్ఫూర్తితో వ్యవహరించి విషయం ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ కు వివరించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె భర్తకు ఈ విషయం తెలియజేశారు. ఆసుపత్రికి వెళ్లిన పదమూడు గంటల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పుట్టిన బిడ్డకు జమీన్ జేమ్స్ అని పేరుపెట్టారు. ఈ మేరకు బిడ్డ, భర్తతో దిగిన ఫోటోను ఆమె ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ సంఘటన ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.