ఎవరో? ఏంటో? అంటూ 'తొలిప్రేమ'లో వరుణ్ తేజ్ లుక్ బయటపెట్టిన రాశీ ఖన్నా

  • 'తొలిప్రేమ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న వరుణ్ తేజ్
  • లండన్ లో షూటింగ్ 
  • ఫోన్ లో ఎవరో? ఏంటో? వరుణ్ ముసిముసినవ్వులు నవ్వుతున్నాడు
పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా అతని కెరీర్ లో ఎంతపెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇదే సినిమా టైటిల్ తో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో వరుణ్ తేజ్ లుక్ ని రివీల్ చేస్తూ, రాశీ ఖన్నా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫొటో పోస్టు చేసింది.

ఈ ఫోటో సోషల్ మీడియాలో మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. దీనిపై రాశిఖన్నా కామెంట్ చేస్తూ, 'ఈ ఫోటోను 'చూశారా? శీతాకాలం గాలులకు నా హెయిర్‌ క్లియర్‌ గా కంట్రోల్‌ తప్పింది. కానీ, వరుణ్‌ తేజ్‌ హాయిగా నవ్వుతూ ఫోన్‌ లో ఏదో చూసుకుంటున్నాడు. (ఫోనులో) ఎవరో? ఏంటో?' అంటూ ఆసక్తిగా అభిమానులను అడిగింది. కాగా ఈ సినిమాకు నిర్మాతగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ వ్యవహరిస్తుండగా, వెంకీ అట్లూరి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 
Go Back to Shorts
toliprema
varun tej
rasi khanna

More Telugu News