ప్రతి ఒక్కరిలో మహాత్ముడి స్ఫూర్తి నిండాలి: జగన్
- మహాత్ముడిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం
- ఆయన స్ఫూర్తి అందరిలో నిండాలి
- ఘన నివాళి అర్పించిన జగన్
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నేడు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మహాత్మాగాంధీకి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ట్వీట్ చేశారు. మహాత్మాగాంధీ 148 జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని ట్విట్టర్లో తెలిపారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. అందరిలోనూ ఆయన స్ఫూర్తి నిండాలని ఆకాంక్షించారు. మహాత్ముడి జయంతి సందర్భంగా ఆయనను అందరూ స్మరించుకుందామని తెలిపారు. ఇదే సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా కూడా నివాళి అర్పించారు.