Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ నటుడు మోహన్‌బాబుకు గౌరవ డాక్టరేట్!

  •  డాక్టరేట్ ప్రదానం చేయనున్న ఎంజీఆర్ యూనివర్శిటీ 
  • ‘కంగ్రాట్స్ నాన్నా’ అంటూ మంచు మనోజ్ ట్వీట్
సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు మరో అరుదైన గౌరవం లభించనుంది. చెన్నైలోని ఎంజీఆర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ హీరో, మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.

ఈ నెల 4వ తేదీన ఈ డాక్టరేట్ ను తన తండ్రి అందుకోనున్నట్టు పేర్కొన్న మనోజ్, ‘కంగ్రాట్స్ నాన్నా..ఎంతో గర్వపడే క్షణం’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఫొటోను పోస్ట్ చేశాడు. కాగా, సినీ నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా మోహన్ బాబు తనదైన ముద్ర వేశారు. సుమారు 560 చిత్రాల్లో నటించిన ఆయన, టీడీపీ తరపున గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2007లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో మోహన్ బాబును భారత ప్రభుత్వం గౌరవించింది.
ఎంజీఆర్ యూనివర్శిటీ
మోహన్ బాబు
మంచు మనోజ్

More Telugu News