హీరోయిన్ కు మద్దతు తెలిపి... శింబు తండ్రి వ్యాఖ్యలను ఖండించిన విశాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్ కు మద్దతు తెలిపి... శింబు తండ్రి వ్యాఖ్యలను ఖండించిన విశాల్

  • ధన్సికకు మద్దతు తెలిపిన విశాల్
  • క్షమాపణలు చెప్పి, కాళ్లు పట్టుకున్నా ఆమెను లక్ష్యం చేసుకున్నారు
  • హీరోయిన్లుగా రాణించడం చాలా కష్టమైన పని
  • ధన్సిక సహనటులపై మండిపడ్డ విశాల్
టీఎఫ్పీసీ ప్రెసిడెంట్‌, నటుడు విశాల్‌ కథానాయిక ధన్సికకు మద్దతు తెలిపాడు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు పెడుతూ... 'విళిథిరు' చిత్రమీడియా సమావేశంలో తన పేరును ప్రస్తావించనందుకు ఆ తర్వాత ధన్సిక క్షమాపణలు చెప్పినా టీఆర్ (టి.రాజేందర్) ఆమెను లక్ష్యం చేసుకున్నారు. టీఆర్‌ అనుభవం ఉన్న బహుళ ప్రతిభావంతుడు. సమావేశాల్లో కొందరి పేర్లను మర్చిపోయి మాట్లాడడం సర్వసాధారణ విషయం. గతంలో నేను కూడా చాలాసార్లు అలా చేశా. వేదికపై ఉన్న పెద్దలకు ధన్యవాదాలు చెప్పడం కూడా మర్చిపోయాను.

తన పొరపాటుకు ధన్సిక క్షమాపణలు చెప్పింది. టీఆర్‌ పాదాలు తాకింది. అయినా సరే ఆయన అదేపనిగా ఆమెను విమర్శించారు. తన కుమార్తె వయసున్న ధన్సికను టీఆర్‌ క్షమించలేకపోయారు. సినీ పరిశ్రమలో ఒక మహిళ రాణించడం చాలా కష్టమైన పని. ధన్సిక మంచి వ్యక్తి అని నాకు తెలుసు. టీఆర్‌ పేరు చెప్పకపోవడం వెనుక ఆమె మనసులో మరో ఉద్దేశం లేదని ప్రజలందరికీ తెలుసు. ధన్సిక క్షమాపణ చెప్పినా, టీఆర్‌ ఆమెను టార్గెట్‌ చేసి మాట్లాడడాన్ని నేను ఖండిస్తున్నాను" అంటూ పేర్కొన్నాడు.

అదే లేఖలో ఆమె సహనటులను ఉద్దేశించి...‘ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. విదార్థ్‌, కృష్ణ! మీ సహనటిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన టీఆర్‌ ప్రసంగం పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టకూడదన్న కనీస సభ్యత మీకు ఉందనుకున్నాను. కానీ మీరు దాన్ని నిలబెట్టుకోలేదు’ అంటూ వారిపై మండిపడ్డాడు. 
vishal
dhanshika
t.rajendar
vilitiru movie

More Telugu News