మహేష్‌ హీరో.. విజయ్‌ విలన్‌ గా మురుగదాస్ కొత్త సినిమా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేష్‌ హీరో.. విజయ్‌ విలన్‌ గా మురుగదాస్ కొత్త సినిమా?

  • తెలుగు సినిమాలో మహేష్ బాబు హీరో విజయ్ విలన్
  • తమిళంలో విజయ్ హీరో, మహేష్ బాబు విలన్
  • కథ వినిపించిన మురుగదాస్
  • ఇంకా ఓకే చెప్పని స్టార్ హీరోలు
సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ ఇళయదళపతి విజయ్ లిద్దరూ ఒకే సినిమాలో హీరో, విలన్ పాత్రల్లో నటిస్తే? ఊహే ఆశ్చర్యకరంగా ఉంది కదా... అయితే ఈ కాంబినేషన్ అసాధ్యం కాదని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఇది సాధ్యంకానుందని కోలీవుడ్ కథనాలు చెబుతున్నాయి. ఈ అద్భుతానికి నాంది పలికేది మురుగదాస్ అని కోలీవుడ్ కోడైకూస్తోంది. మహేష్ బాబు హీరోగా, విజయ్ విలన్ గా మురుగదాస్ ఒక సినిమాను రూపొందించనున్నారని, ఈ మేరకు వారిద్దరికీ ఒక కథను వినిపించారని తెలుస్తోంది.

దానిపై వారిద్దరూ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోలీవుడ్ చెబుతోంది. అయితే ఈ సినిమా తెలుగులో మహేష్ బాబు హీరో అయితే, తమిళంలో మహేష్ బాబు విలన్ గా నటించాల్సి ఉంటుందనే కండిషన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబుతో సినిమా తీసిన మురుగదాస్ తెలుగు, తమిళ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు తమిళ సినీ పరిశ్రమ చెప్పుకుంటోంది. అయితే ఒకరు పోషించిన పాత్రను పోషించేందుకు తాను మొగ్గుచూపనని మహేష్ బాబు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 
mahesh babu
vijay
murugadas

More Telugu News