గుంటూరులో ఎంపీ-ఎమ్మెల్యే మధ్య ‘స్పైడర్’ ఫ్లెక్సీల వివాదం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుంటూరులో ఎంపీ-ఎమ్మెల్యే మధ్య ‘స్పైడర్’ ఫ్లెక్సీల వివాదం!

  • ‘స్పైడర్’ ఫ్లెక్సీలపై ఎంపీ గల్లా జయదేవ్ ఫొటో
  •  ఆ ఫ్లెక్సీలపై స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంతో గొడవ 
  • ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాటిని తొలగించిన మునిసిపల్ సిబ్బంది
  • మండిపడుతున్న ఎంపీ వర్గీయులు, మహేష్ బాబు అభిమానులు
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ చిత్రం రెండు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల సందర్భంగా ‘స్పైడర్’ ఫ్లెక్సీలను ఆయన అభిమానులు గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలపై మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ ఫొటోలు ఉన్నాయి. దీంతో, ఆ ఫ్లెక్సీలపై తన ఫొటో లేదంటూ స్థానిక ఎమ్మెల్యే మనస్తాపం చెందారట. ఈ నేపథ్యంలో, ఆ ఫ్లెక్సీలను తొలగించాలంటూ మునిసిపాలిటీ సిబ్బందిని ఆయన ఆదేశించడంతో వాటిని తీసివేశారట.

అదే సమయంలో ఈ ఫ్లెక్సీలను తొలగించవద్దంటూ ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో, సదరు ఎమ్మెల్యే తీరుపై ఎంపీ వర్గీయులు, మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు ఎంపీ వర్గీయులు సిద్ధపడినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, స్పైడర్ సినిమాపై తప్పుడు రివ్యూలు రాస్తున్నారంటూ తిరుపతిలో మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు. స్థానిక సంధ్యా థియేటర్ వద్ద ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు.
స్పైడర్
మహేష్
ఎంపీ గల్లా జయదేవ్

More Telugu News