Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీలంకలో క్రికెట్ ఆడిన దర్శకుడు రాజమౌళి.. తన టీమ్ తో ఫొటో!

  • ప‌లు ప్ర‌దేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోన్న రాజమౌళి
  • శ్రీలంక‌లోని గాలేలో ఉన్న దర్శకుడు
  • లోకల్ త‌మిళ్ క్రికెట్ టీమ్‌తో ఆడానని ట్వీట్
బాహుబలి 1, 2 సినిమాల కోసం ఐదేళ్లు శ్ర‌మించిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటూ ప‌లు ప్ర‌దేశాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

ప్రస్తుతం శ్రీలంక‌లోని గాలేలో లోకల్ త‌మిళ్ క్రికెట్ టీమ్‌తో ఉన్నాన‌ని, వారితో ఆడ‌డం స‌ర‌దాగా ఉంద‌ని పేర్కొంటూ.. ఆ క్రికెట్ టీమ్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. కాగా, ఆయ‌న త‌దుప‌రి తీయ‌బోయే సినిమాపై అభిమానుల్లో అప్పుడే ఎంతో ఆస‌క్తి నెల‌కొంది.      
rajamouli

More Telugu News