అప్పట్లో అబ్బాయిలు వెంట పడుతుంటే గర్వంగా ఉండేది... ఇప్పుడు కామన్: హీరోయిన్ కాజల్
- చదువుకునే రోజుల్లో అవన్నీ సాధారణం
- ఎన్నడూ అబ్బాయిలను ప్రోత్సహించలేదు
- అనుభూతిని ఆస్వాదించేదాన్ని: కాజల్
"అప్పట్లో అబ్బాయిలు వెంట పడుతూ ఉంటే సీరియస్ గా తీసుకునే దాన్ని కాదు. ఆ వయసులో అది సాధారణమే కదా. అదంతా ఆకర్షణే. దీనికితోడు అబ్బాయిలు మా గురించి ఆలోచిస్తూ, మమ్మల్నే చూస్తుంటే గర్వంగానూ ఉంటుంది. వాళ్లపై ఇంట్లో ఫిర్యాదు చేసేదాన్ని కాదు. అంతమాత్రాన వాళ్లను ఎన్నడూ ప్రోత్సహించలేదు కూడా. కేవలం ఆ ఎక్స్ పీరియన్స్ ను ఆస్వాదిస్తూ ఉండేదాన్ని" అని తన అనుభవాలను చెప్పుకొచ్చింది.