తనను తానే పెళ్లి చేసుకున్న ఇటాలియన్ యువతి... ఒంటరిగా హనీమూన్ కూడా వెళ్లిన వైనం
- మగాడి మీద ఆధారపడే ఉద్దేశం లేదన్న పెళ్లికూతురు
- సరైనవాడు దొరకకపోవడంతోనే ఈ నిర్ణయం
- అంగరంగ వైభవంగా పెళ్లి తంతు
ఇటీవల తనకు 40 ఏళ్లు వచ్చాయి. సరైన వ్యక్తి కూడా దొరకలేదు. దీంతో తాను అన్నట్లుగానే తనను తాను పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఒంటరిగా ఈజిప్టుకు హనీమూన్‌కి కూడా బయల్దేరింది. 70 మంది అతిథుల సమక్షంలో పెళ్లిలో జంటగా చేయాల్సిన అన్ని పనులను తానే ఒంటరిగా చేసింది. ఈ పెళ్లి కోసం పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఖర్చుపెట్టింది. మగాళ్లపై ఆధారపడే ఉద్దేశం లేకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు లారా తెలిపింది. `సోలోగమీ`గా పిలిచే ఈ స్వయం వివాహం ఈ మధ్య ప్రపంచంలోని వివిధ దేశాల్లో ట్రెండ్‌గా మారింది.