కొత్త ఫీచర్ ను ఆవిష్కరించనున్న ఫేస్బుక్... రక్తదాతలకు, గ్రహీతలకు ప్రయోజనకారి!
- జాతీయ రక్తదాతల దినోత్సవం రోజున ఆవిష్కరణ
- రక్తదానానికి ప్రచారం కల్పించడమే ధ్యేయం
- సులభతరం కానున్న బ్లడ్ డొనేషన్
వారు సమ్మతిస్తే హాస్పిటల్ వివరాలు, లోకేషన్, రక్తం అవసరమైన వారి కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన సమయంలో రక్తదానం చేయడం కుదరకపోతే ఆ నోటిఫికేషన్ను షేర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీని వల్ల రక్తదానం కోసం రిజిస్టర్ చేసుకోని వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. రక్తదానం చేయడానికి ప్రచారం కల్పిస్తూ, దాతలను, గ్రహీతలను, బ్లడ్ బ్యాంకులను ఒకేతాటి మీదకి తీసుకురావడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఫేస్బుక్ దక్షిణాసియా ప్రతినిధి హేమ బూదరాజు తన బ్లాగ్లో పేర్కొన్నారు.