మహిళా కానిస్టేబుల్ స్నానం చేస్తుండగా వీడియో తీసిన కానిస్టేబుల్‌కు అరదండాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా కానిస్టేబుల్ స్నానం చేస్తుండగా వీడియో తీసిన కానిస్టేబుల్‌కు అరదండాలు!

  • వీడియో ఎందుకు తీశావని ప్రశ్నించినందుకు దాడి
  • కానిస్టేబుల్, అతడి భార్య, తల్లి, సోదరుడిపై కేసు
మహిళా కానిస్టేబుల్ స్నానం చేస్తుండగా వీడియో తీసిన కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ తనను వీడియో తీసిన విషయాన్ని గుర్తించిన బాధితురాలు చత్రుష్రింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను ఇంటిలో స్నానం చేస్తుండగా కానిస్టేబుల్ సమీర్ పటేల్ తన బాత్రూం కిటీకీ ద్వారా తనను వీడియో తీయడం చూశానని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 తనను వీడియో తీసినందుకు సమీర్‌తో ఆమె వాగ్వాదానికి దిగారని సీఐ దయానంద్ ధోమ్ తెలిపారు. వాగ్వాదంతో రెచ్చిపోయిన సమీర్ కుటుంబ సభ్యులు మహిళా కానిస్టేబుల్‌పై దాడికి దిగారని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో కానిస్టేబుల్ సమీర్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సమీర్‌తోపాటు అతడి భార్య, సోదరుడు, తల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
Pune
Policeman
Woman Constable
Taking Bath

More Telugu News