పులులను రెచ్చగొట్టాలని చూసి.. నవ్వుల పాలైన యువకుడు.. వీడియో వైరల్!
- చైనాలోని గుయియాంగ్ లో ఘటన
- జూకు వెళ్లి పులుల ముందు కోతిలా ప్రవర్తించిన యువకుడు
- అతడిని చూసీ చూడనట్లు వదిలేసిన పులులు
అందు కోసం కోతిలా ఎగురుతూ, పిచ్చి చేష్టలు చేశాడు. అయితే, ఆ పులులు మాత్రం అతనిని చూసినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎంతో సంయమనం పాటిస్తున్నట్లు కనపడిన వాటి తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. వాటి నుంచి ఎంతకీ ప్రతిస్పందన రాకపోతుండడంతో ఆ యువకుడు మరింత పిచ్చి చేష్టలు చేశాడు. అటూ ఇటూ ఊగుతూ, గెంతుతూ చివరికి అలసిపోయాడే గానీ వాటిని మాత్రం రెచ్చగొట్టలేకపోయాడు.
దీంతో అక్కడి సందర్శకుల ముందు అతను నవ్వుల పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు అంతర్జాలంలో పెట్టారు. జూలో ఇలా మృగాలను రెచ్చగొట్టడంపై నిషేధం ఉంటుంది. ఇలా చేయడం ఎంతో ప్రమాదకరం కూడా.