సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • 'డాబర్ వాటిక' ప్రచార చిత్రం షూటింగులో సమంత
  • విక్రం తమిళ చిత్రం తెలుగు అనువాదం పేరు '10'
  • మూడు భాషల 'క్వీన్'  షూటింగుకి రెడీ
*  ఇటు సినిమాలు, అటు కమర్షియల్స్ తో బిజీగా వున్న చెన్నయ్ బ్యూటీ సమంత గత నాలుగేళ్లుగా 'డాబర్ వాటిక' ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఈ బ్రాండ్ కోసం తాజాగా ఈ ముద్దుగుమ్మపై ఓ ప్రచార చిత్రాన్ని షూట్ చేశారు. త్వరలో ఇది టీవీలలో ప్రసారం అవుతుంది.
*  తమిళ కథానాయకుడు విక్రం హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న '10 ఎన్నత్తు కుల్ల' తమిళ చిత్రాన్ని తెలుగులోకి '10' పేరుతో డబ్ చేస్తున్నారు. సమంత నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేశారు.
*  'క్వీన్' తెలుగు రీమేక్ షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. తెలుగు వెర్షన్లో తమన్నా కథానాయికగా నటిస్తుండగా నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ వెర్షన్లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇక కన్నడ రీమేక్ లో పారుల్ యాదవ్ నాయిక పాత్ర పోషిస్తోంది.     
samanta
vikram

More Telugu News