సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు .. సంక్షిప్త సమాచారం!

  •  'కుంభకోణం'లో షూటింగ్ పూర్తి చేసుకున్న బాలకృష్ణ 
  •  తన రాజకీయ రంగ ప్రవేశం గురించి త్రిష
  •  బాలీవుడ్ తెరపైకి మరో రెండు బయోపిక్స్     
* బాలకృష్ణ 102వ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా 'కుంభకోణం'లో జరుగుతూ వస్తోంది. సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా నిన్నటితో అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, నటాషా దోషి కీలకమైన పాత్రలో కనిపించనుంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

* రాజకీయాల పట్ల తనకి చాలా ఆసక్తి ఉందనే విషయాన్ని చాలాకాలం క్రితమే త్రిష చెప్పింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో .. రజనీ పార్టీలో చేరతారా? .. కమల్ పార్టీలో చేరతారా? అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. వాళ్లిద్దరూ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక ఏ పార్టీలో చేరతాననేది చెబుతానని త్రిష లౌక్యంగా సమాధానమిచ్చింది.

* బాలీవుడ్ లో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. మ్యాథమెటీషియన్ ఆనంద్ కుమార్ .. క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్రలను తెరకెక్కించే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. 'సూపర్ 30' ఆనంద్ కుమార్ పాత్రలో హృతిక్ రోషన్ .. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించనున్నారు.  
   
balakrishna

More Telugu News