భూకంపంలో చ‌నిపోయిన వారికి సంతాపం తెలిపిన ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో

ఇటీవ‌ల శాంటియాగో భూకంపంలో చ‌నిపోయిన త‌న అభిమానికి ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ట్విట్ట‌ర్ ద్వారా సంతాపం ప్రకటించాడు. త‌న రియ‌ల్ మాడ్రిడ్ జ‌ట్టు జెర్సీ మీద `నా నెం. 1 శాంటియాగో అభిమాని` అని రాసి, దాన్ని ప‌ట్టుకుని దిగిన ఫొటోను రొనాల్డో షేర్ చేశాడు. శాంటియాగోలో సంభ‌వించిన 7.1 తీవ్ర‌త గ‌ల భూకంపం కార‌ణంగా ఓ విద్యార్థి చనిపోయాడు. చ‌నిపోయిన బాలుడు రొనాల్డోకి పెద్ద అభిమాని. ఈ విష‌యాన్ని అత‌ని కుటుంబ‌స‌భ్యులు రొనాల్డోకి తెలిపారు.

 దీంతో ఆ బాలుడితో పాటు, భూకంపంలో చనిపోయిన వారంద‌రి కుటుంబాల‌ను రొనాల్డో సోష‌ల్ మీడియా ద్వారా ప‌రామ‌ర్శించాడు. `ఇలాంటి బాధాక‌ర సంఘ‌ట‌న‌లో నా శాంటియాగో అభిమాని కుటుంబానికి, అలాగే త‌మ ఆప్తుల్ని కోల్పోయిన వారంద‌రికీ నేను అండ‌గా ఉంటాను` అని రొనాల్డో పోస్ట్ చేశాడు. అలాగే రొనాల్డో జ‌ట్టు అథ్లెటిక్ మాడ్రిడ్ భూకంప బాధితుల కోసం 50వేల యూరోలు స‌హాయంగా అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.
Go Back to Shorts
santiago
cristiano ronaldo
mexico
earthquake
solidarity
twitter

More Telugu News