ట్రంప్ కాసుకో... మా రాకెట్లు వస్తున్నాయి: ఐరాస వేదికపై ఉత్తర కొరియా హెచ్చరిక
- ఐరాస వేదికపై ప్రసంగించేందుకు ఉత్తర కొరియాకు అవకాశం
- ట్రంప్ కు తీవ్ర హెచ్చరికలు పంపిన రీ యాంగ్ హో
- యూఎస్ ను తమ క్షిపణులు తాకుతాయని వెల్లడి
తమ బలాన్ని చూపించేందుకే అమెరికా ఈ పని చేసిందని తెలుస్తుండగా, తన ప్రసంగంలో రీ యాంగ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై విరుచుకుపడ్డారు. ఆయన మాటలను ప్రస్తావిస్తూ, దానికి ప్రతిగా తమ దేశపు రాకెట్లు అతి త్వరలో అమెరికా దేశాన్ని తాకుతాయని హెచ్చరించారు. యూఎస్ ప్రధాన భూభాగాలను తమ క్షిపణులు సందర్శిస్తాయని అన్నారు. కిమ్ జాంగ్ ఉన్ ను 'లిటిల్ రాకెట్ మ్యాన్' అని డొనాల్డ్ వ్యాఖ్యానించినందుకు ప్రతీకారంగా దాడులు తప్పవని రీ యాంగ్ తెగేసి చెప్పడం గమనార్హం.