అశ్విన్, జడేజాలను ఇక మరచిపోవచ్చు: వీరేంద్ర సెహ్వాగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అశ్విన్, జడేజాలను ఇక మరచిపోవచ్చు: వీరేంద్ర సెహ్వాగ్

  • అద్భుతంగా రాణిస్తున్న కులదీప్, చాహాల్
  • స్టార్ బౌలర్లు లేని లోటు తెలియనివ్వడం లేదు
  • కితాబిచ్చిన మాజీ ఓపెనర్ సెహ్వాగ్
భారత స్టార్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను క్రికెట్ అభిమానులు మరచిపోయేలా కులదీప్ యాదవ్, యజువేంద్ర చాహాల్ లు అద్భుత రీతిలో తమ ఫామ్ ను కొనసాగిస్తున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అశ్విన్, జడేజాలను వారు మరిపిస్తున్నారని కితాబిచ్చాడు. స్టార్ బౌలర్లు లేని వేళ, జట్టులో ఏర్పడిన శూన్యాన్ని వీరిద్దరూ భర్తీ చేశారని, ఎప్పుడు వికెట్ కావాలని అనిపించినా, తామున్నామని భరోసాను ఇచ్చేలా వీరి ప్రదర్శన సాగుతోందని అన్నాడు.

కోహ్లీ సైతం చాహాల్ ను పిలిచి మరీ బౌలింగ్ ను అప్పగిస్తున్నాడని, నేటి మ్యాచ్ లోనే ఇండియా సిరీస్ ను గెలుచుకుని 3-0 ఆధిక్యంలోకి వెళుతుందని తాను భావిస్తున్నానని అన్నాడు. ఇద్దరు అనుభవజ్ఞులు లేని లోటు తెలియడం లేదని 'ఇండియా టీవీ 'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గురువారం జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్ లో ఎన్నో ఏళ్ల తరువాత భారత్ తరఫున హ్యాట్రిక్ తీసిన ఘనతను కులదీప్ యాదవ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
sehwag
kuldeep yadav
chahal
ashwin
jadeja

More Telugu News