'జనతా గ్యారేజ్'ను బీట్ చేసేస్తోన్న 'జై లవ కుశ'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జనతా గ్యారేజ్'ను బీట్ చేసేస్తోన్న 'జై లవ కుశ'

  •  థియేటర్స్ లో సందడి చేస్తోన్న 'జై లవ కుశ'
  •  యూఎస్ లోను రికార్డు స్థాయి వసూళ్లు
  •  ప్రీమియర్ షోస్ వసూళ్లలో 'జనతా గ్యారేజ్' ను బీట్ చేసేసింది
  •  ఫుల్ రన్ లో 'నాన్నకు ప్రేమతో' వసూళ్లను అధిగమించే ఛాన్స్        
తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లోను వసూళ్ల పరంగా 'జై లవ కుశ' దూసుకుపోతోంది. ఎన్టీఆర్ కెరియర్లో యూఎస్ లో ప్రీమియర్ల ద్వారా అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా 'జనతా గ్యారేజ్' నిలిచింది. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా అక్కడ 5.87 లక్షల డాలర్లను వసూలు చేసింది. తాజాగా 'జై లవ కుశ' 5.89 లక్షల డాలర్లను రాబట్టింది. మరుసటి రోజుతో కలుపుకుంటే 9 లక్షల డాలర్లను వసూలు చేయవచ్చని ఒక అంచనా.

 ఇక శని .. ఆదివారాల్లో వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయి కనుక, 'జనతా గ్యారేజ్' ఫుల్ రన్ వసూళ్లను .. 'జై లవ కుశ' తొలి వారాంతంలోనే బీట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. 'జై లవ కుశ' ఫుల్ రన్ లో 'నాన్నకు ప్రేమతో' రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి 'జై లవ కుశ' ఆడియన్స్ అంచనాలను అందుకుందనే చెప్పాలి.   
ntr
rasi khanna

More Telugu News