హనీప్రీత్ పాత్ర‌లో న‌టిస్తానంటున్న రాఖీసావంత్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హనీప్రీత్ పాత్ర‌లో న‌టిస్తానంటున్న రాఖీసావంత్‌

  • రామ్ ర‌హీమ్ జీవితక‌థ‌తో సినిమా తీస్తా!
  • వారి జీవితాల‌ను బ‌య‌ట‌పెడ‌తా!
  • హ‌నీప్రీత్ లండ‌న్‌లో ఉండొచ్చు
  • రాఖీ సావంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
గుర్మీత్ బాబా జీవిత‌గాథ‌ను సినిమాగా తీసి అత‌ని జీవితంలోని అన్ని విష‌యాల‌ను బ‌య‌ట‌పెడ‌తాన‌ని బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్ అంటోంది. ఆ చిత్రంలో తాను గుర్మీత్ బాబా ప్రియురాలు హ‌నీప్రీత్ పాత్ర‌ను పోషిస్తాన‌ని తెలిపింది. `హ‌నీప్రీత్ నాకు 8 ఏళ్లుగా తెలుసు. ఆమె గురించి నాకు అన్ని విష‌యాలు తెలుసు. నాకు తెలిసి ప్ర‌స్తుతం ఆమె లండ‌న్‌లో ఉండి ఉంటుంది. నేను, నా అన్న రాకేశ్ సావంత్ క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తాం` అని రాఖీ సావంత్ వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం ఢిల్లీలో ఉన్న రాఖీ, అక్క‌డే డేరా స‌చ్చా సౌధాలాగే ఉండే సెట్ వేయించి, అందులోనే సినిమా షూటింగ్ చేస్తామ‌ని పేర్కొంది. గుర్మీత్ వ్య‌వ‌హారాల‌న్నింటినీ బ‌య‌ట‌పెట్టిన త‌ర్వాతే తాను ఊపిరి పీల్చుకుంటాన‌ని రాఖీ త‌న అభిమానుల‌కు మాట ఇచ్చింది. గ‌తంలో సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్య‌కేసు ఆధారంగా రూపొందించిన `ఏక్ క‌హానీ జూలీ కీ` సినిమాలో షీనా బోరా పాత్ర‌ను రాఖీ పోషించింది. అప్పుడు కూడా షీనా బోరాకి, త‌న‌కి మంచి స్నేహం ఉంద‌ని రాఖీ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.
honeypreet
dera baba
biopic
gurmeet ram raheem
rakhi sawant

More Telugu News