భారత్‌లో సూఫీ సంగీత కచేరీలో మొదటిసారి పాల్గొననున్న ఏఆర్ రెహమాన్
భారత్‌లో జరగనున్న తన మొదటి సూఫీ కచేరీలో పాల్గొనడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు రెహమాన్ ట్విట్టర్‌లో వెల్లడించాడు. `ద సూఫీ రూట్` వారు నిర్వహిస్తున్న ఈ కచేరీలో రెహమాన్‌తో పాటు ప్రముఖ సూఫీ సంగీత కళాకారులు హాన్స్ రాజ్ హాన్స్, నూరన్ సిస్టర్స్, ముక్తియార్ అలీ, ధ్రువ్ సంగారీ వంటి దిగ్గజాలు పాల్గొననున్నారు.