టెన్నిస్ అభిమానుల‌కు పండ‌గ‌... త్వ‌ర‌లో క‌లిసి ఆడ‌నున్న రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌, ర‌ఫెల్ నాద‌ల్‌!

టెన్నిస్ దిగ్గ‌జాలు రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌, ర‌ఫెల్ నాద‌ల్‌లు త్వ‌ర‌లో ఒకే జ‌ట్టుగా ఆడనున్న‌ట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలో ప్రేగ్‌లో జ‌ర‌గ‌నున్న లావెర్ క‌ప్ డ‌బుల్స్ మ్యాచ్‌లో వీరిద్ద‌రూ ఒకే జ‌ట్టులో ఆడ‌నున్నారు. ప్ర‌పంచ జ‌ట్టు మీద యూర‌ప్ జ‌ట్టు త‌ర‌ఫు నుంచి వీరిద్ద‌రూ ఆడ‌నున్నారు. ఈ సిరీస్‌లో వీరు సింగిల్స్ మ్యాచ్‌లు ఆడే అవ‌కాశం కూడా ఉంది. రెండు దశాబ్దాల వారి టెన్నిస్ కెరీర్‌లో వీరిద్ద‌రూ క‌లిసి ఆడ‌టం ఇదే మొద‌టిసారి. వీరితో పాటు యూర‌ప్ జ‌ట్టులో మారిన్ కిలిక్‌, అలెగ్జాండ‌ర్ జెరెవ్‌, డొమిన‌క్ థెయిమ్‌, థామ‌స్ బెర్డిచ్‌లు ఉన్నారు. అలాగే ప్ర‌పంచ జ‌ట్టులో ఫ్రాన్సిస్ థ్యోఫే, సామ్ క్వెర్రీ, జాన్ ఐస్న‌ర్‌, జాక్ సాక్‌, నిక్ కిర్గోస్‌లు ఉన్నారు.
Go Back to Shorts
tennis
rafael nadal
roger federer
laver cup
prague

More Telugu News