రవితేజను టెన్షన్ పెట్టేస్తోన్న నాగార్జున!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజను టెన్షన్ పెట్టేస్తోన్న నాగార్జున!

  •  'రాజా ది గ్రేట్'పై రవితేజ ఆశలు
  •  ఆ మరుసటి రోజునే 'రాజుగారి గది 2'
  •  నాగ్ ఇమేజ్ .. సమంతా క్రేజ్ 
  •  రవితేజలో మొదలైన టెన్షన్
నాగార్జున ప్రధానమైన పాత్రను పోషించిన 'రాజుగారి గది 2' .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. దీపావళి కానుకగా దీనిని అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. దాంతో రవితేజకు టెన్షన్ పట్టుకుందనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రవితేజ తాజా చిత్రంగా రూపొందుతోన్న 'రాజా ది గ్రేట్' అక్టోబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై రవితేజ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

రవితేజ ఖాతాలోకి హిట్ వెళ్లి చాలా కాలమైంది. అందువలన ఆయన ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ ను సాధిస్తాననే నమ్మకంతో వున్నాడు. అయితే ఆయనని 'రాజుగారి గది 2' రిలీజ్ డేట్ టెన్షన్ పెట్టేస్తోంది. నాగార్జున .. సమంతా వంటి స్టార్స్ ఈ సినిమాలో ఉండటం, గతంలో హిట్ కొట్టిన 'రాజుగారి గది' ప్రభావం ఈ సినిమాపై వుండటం ఆయనను కంగారు పెడుతోందని చెప్పుకుంటున్నారు.         
raviteja
mehreen

More Telugu News