నివేదా థామస్ కి మాటిచ్చాను.. 'జై లవకుశ' హిట్టైనా ఫట్టైనా చేసి పెడతాను!: జూనియర్ ఎన్టీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నివేదా థామస్ కి మాటిచ్చాను.. 'జై లవకుశ' హిట్టైనా ఫట్టైనా చేసి పెడతాను!: జూనియర్ ఎన్టీఆర్

  • నివేదాకిచ్చిన మాట నెరవేరుస్తాను
  • సినిమాలో మూడు పాత్రలు, బిగ్ బాస్ షో ఇంటికి వచ్చివెళ్లడం..ఇలా బిజీగా గడిచిపోయింది
  • కుటుంబ సభ్యులకు వంట చేయడం ఇష్టం
  • మీ కోసం బిసిబెలా బాత్ చేసిపెడతా
  • సినిమా హిట్టైనా ఫట్టైనా మాట తప్పను
'జై లవ కుశ' సినిమా విడుదల నేపథ్యంలో సినీ ప్రమోషన్ లో జూనియర్ ఎన్టీఆర్ బిజీబిజీగా గడిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహనటి నివేదా థామస్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఒక టీవీ చానెల్ చిట్ చాట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జూనియర్ మాట్లాడుతూ, తీరిక సమయాల్లో కుటుంబ సభ్యుల కోసం వంటచేయడం చాలా ఇష్టమని అన్నాడు. దీంతో యాంకర్... 'నివేదా, మీకోసం తారక్ ఏం వంట చేశాడు?' అని అడిగింది. దానికి తారక్ మళ్లీ బదులిస్తూ, తన కోసం బిసిబెలా బాత్ చేసిపెడతానని ఆల్రెడీ చెప్పా, కానీ కుదరలేదన్నాడు.

సినిమాలో మూడు పాత్రలు చేయడం, 'బిగ్ బాస్' హౌస్ కి వెళ్లి రావడం, మళ్లీ ఇంటికి వెళ్లడం, షూటింగ్ కి రావడం.. కొడుకుని మిస్సవడం.. ఇలా చాలా కారణాలతో నివేదాకి ఇచ్చిన మాట ఇంతవరకు నెరవేర్చలేదని అన్నాడు. ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా కాబట్టి, సినిమా హిట్టైనా, ఫట్టైనా నివేదాకిచ్చినమాట నెరవేరుస్తానని తారక్ తెలిపాడు. అంతే కాకుండా యాంకర్ నుద్దేశించి, 'ఆ రోజు నిన్ను కూడా పిలుస్తాను, వచ్చి టేస్ట్ చేద్దువు గాని' అన్నాడు. దీంతో యాంకర్ ఉబ్బితబ్బిబ్బైపోయింది. 
jr ntr
jailava kusha promotion
nivetha thomas

More Telugu News