విదేశీ సెన్సార్ బోర్డు సభ్యుడి 'జై లవ కుశ' సినిమా రివ్యూ... రేటింగ్ ఇవిగో!
- జై లవ కుశ విదేశాల సెన్సార్ పూర్తి
- విదేశాల్లో సెన్సార్ సభ్యుడి రివ్యూ
- మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అదుర్స్
- సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాస్ ఎలిమెంట్స్, క్లైమాక్స్ అదుర్స్
- డైరెక్టర్ చక్కగా తెరకెక్కించాడు
- జూనియర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్
- జూనియర్, కల్యాణ్ రామ్ కాంబినేషన్ జంట హిట్ బోణీ
- సినిమా రేటింగ్ 3.5
రాశీఖన్నా, నివేదా థామస్ లు ఆకట్టుకున్నారని ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ ఎప్పట్లానే డాన్సులు ఇరగదీశాడని, ఆయన ఫైట్స్ కు కూడా అభిమానులు ఫిదా అవుతారని ఆయన చెప్పారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అభిమానులను అలరిస్తాయని ఆయన తెలిపారు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ సాగదీసినట్టు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎడిటింగ్ ఇంకొంచెం మెరుగ్గా ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు. ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని, బ్లాక్ బస్టర్ హిట్ అని ఆయన తెలిపారు. ఈ సినిమాకు తాను 3.5 రేటింగ్ ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడగా, అన్నదమ్ములైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ జంట సూపర్ హిట్ తో బోణీ కొట్టిందని ఆయన పేర్కొన్నారు.