తమిళ 'అర్జున్ రెడ్డి'గా ఆర్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ 'అర్జున్ రెడ్డి'గా ఆర్య!

  •  'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ రైట్స్ తీసుకున్న ధనుష్ 
  •  హీరో పాత్ర కోసం ఆర్యతో సంప్రదింపులు
  •  గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆర్య  
ఈ ఏడాది యూత్ కి బాగా కనెక్ట్ అయిన సినిమాగా 'అర్జున్ రెడ్డి' నిలిచింది. ఈ సినిమా సాధించిన రికార్డులు ఇతర భాషలకి చెందిన దర్శక నిర్మాతలను ఆకర్షించాయి. ఈ కారణంగా ఈ సినిమాను తమ భాషల్లో రీమేక్ చేయడానికి వాళ్లంతా పోటీ పడుతున్నారు.

 ఈ సినిమా బాలీవుడ్ రీమేక్ లో రణవీర్ సింగ్ .. కన్నడ రీమేక్ లో యష్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక తమిళ రీమేక్ లో ఆర్య చేయనున్నట్టు సమాచారం. ధనుష్ తన సొంత బ్యానర్ ద్వారా ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను .. తమిళంలో ఆర్య అయితే బాగా చేస్తాడని ధనుష్ భావించాడట. ధనుష్ సంప్రదించడం .. ఆర్య ఓకే చెప్పేయడం జరిగిపోయాయని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేసి .. సెట్స్ పైకి వెళతారనే టాక్ వినిపిస్తోంది.   
arya

More Telugu News