బీజేపీ ఎంపీ మహంత్ చంద్ నాథ్ కన్నుమూత
- అల్వార్ నియోజకవర్గ ఎంపీ చంద్ నాథ్
- అనారోగ్యంతో కన్నుమూత
- సంతాపం తెలిపిన సురేష్ ప్రభు
రాజస్థాన్ లోని అల్వార్ నియోజకవర్గ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత మహంత్ చంద్ నాథ్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ మరణించారు. 'నాథ్' అనే హిందూ సంఘానికి చీఫ్ గా వ్యవహరించి, ఇటీవలే ఆ బాధ్యతలను మహంత్ బాలక్ నాథ్ కు అప్పగించిన చంద్ నాథ్ పై ఓ హత్య కేసు విచారణ దశలో ఉంది.
2004 లో అల్వార్ నుంచి పోటీ పడి కరణ్ సింగ్ చేతుల్లో ఓడిపోయిన ఆయన, 2014లో ఘన విజయం సాధించారు. ఓ స్థలం విషయంలో మోసం చేశారన్న ఆరోపణలు రుజువు కావడంతో హర్యానా న్యాయస్థానం ఆయనకు ఏడాది జైలు శిక్షను విధించింది. చంద్ నాథ్ మృతిపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తన సహచరుడి మరణం కలచి వేసిందని చెప్పారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.