ఆయనే నన్ను మొట్టమొదటి సారిగా ఇంటర్వ్యూ చేశారు: రకుల్ ప్రీత్ సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆయనే నన్ను మొట్టమొదటి సారిగా ఇంటర్వ్యూ చేశారు: రకుల్ ప్రీత్ సింగ్

బ్రెయిన్ స్ట్రోక్ తో క‌న్నుమూసిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు సురేశ్ కృష్ణ‌మూర్తి మృతి ప‌ట్ల టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయ‌న‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని విచారం వ్య‌క్తం చేస్తున్నారు. 'ఆర్ఐ పీ సురేశ్‌ గారూ..' అని పేర్కొన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఆయనే త‌న‌ను మొట్టమొదటి సారిగా ఇంటర్వ్యూ చేశారని తెలిపింది. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ లో తాను న‌టించిన సమయంలో త‌న సినీరంగ‌ ప్ర‌వేశంపై ఆయ‌న ప‌త్రిక‌లో రాశార‌ని గుర్తు చేసుకుంది. సురేశ్ మృతి ప‌ట్ల న‌టులు నాని, మంచు మ‌నోజ్ కుమార్‌, మంచు ల‌క్ష్మి కూడా విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.    
nani
rkul
suresh

More Telugu News